SKLM: వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ నర్తు లక్ష్మీనారాయణ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మంగళవారం సాయంత్రం పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు మరో 15 వైసీపీ కుటుంబాలకు చెందిన సభ్యులు సైతం టీడీపీలో చేరారు.
వార్తలు
టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్


