హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయ సంపదకు గుర్తింపు పెరుగుతోంది: మోదీ

విజయదశమి మనలో ధైర్యాన్ని నింపే విజయ పర్వదినమని ప్రధాని మోదీ వెల్లడించారు. సత్యం, మానవత్వం వైపు నిలిస్తే అంతిమ విజయం మనదేనని చెప్పారు.  జాతీయ ప్రయోజనాల కోసం ఐక్యంగా నిలవాలని వివిధ రంగాల్లోని సంస్థలకు, రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. దేశ పురోగతికి ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కీలకమని చెప్పారు. యునెస్కోలో భారతీయ వారసత్వ సంపదకు గుర్తింపు పెరుగుతుందన్నారు.