KDP: మైలవరం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, వాహనాలను 500 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయాలని సూచించారు. ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ కుళ్లాయప్ప హెచ్చరించారు. బయటి ప్రాంతాల వారు కేంద్రం పరిసరాలకు రావద్దని కోరారు.
వార్తలు
ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ


