ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారిని, ఆశ్రయం కల్పించేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించకూడదని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఉగ్రవాద వ్యవస్థ మొత్తాన్ని సమష్టిగా ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం అనేది అత్యంత తీవ్ర ముప్పుగా పరిణమించిందని తెలిపారు. ఇది అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలిగించడమే కాకుండా పెట్టుబడులు, వాణిజ్యానికీ ఆటంకంగా మారిందని ధ్వజమెత్తారు.
వార్తలు
వారిని ఉపేక్షించకూడదు: రాజ్నాథ్


