హైదరాబాద్: 28°C
వార్తలు

'చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా'

చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని ప్రధాని మోదీ వెల్లడించారు. శ్రీరాముడి గెలుపును సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ పండగ వేడుకలు దేశమంతటినీ ఏకం చేస్తాయని చెప్పారు. సుపరిపాలనకు రామరాజ్యం విజయవంతమైన నమూనా అని తెలిపారు. మనందరి ముందు వికసిత్ భారత్ అనే లక్ష్యం ఉందని.. దీన్ని సాధించటం కోసం రాముడి నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.