హైదరాబాద్: 28°C
వార్తలు

కమిషనర్‌కి బీ ఫారం అందజేత

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ కూటమి బీజేపీ అభ్యర్థి మైపాడ ప్రసాద్ మంగళవారం సాయంత్రం బీ ఫారం నగర కమిషనర్ టి గోవిందరావుకు అందజేశారు. కూటమి అభ్యర్థిగా బలపరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలు తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుర్లే శ్రీధర్ పాల్గొన్నారు.