హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరవీరుల దినోత్సవానికి పోలీసుల కవాతు సాధన

BPT: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న నిర్వహించనున్న కార్యక్రమానికి పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బాపట్ల పట్టణ PS వద్ద సిబ్బంది కవాతు సాధన చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమంలో పరేడ్, గౌరవ వందనం సమర్పించేందుకు సిబ్బంది సాధన చేస్తున్నారు.