హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిద్రమత్తులో లారీ డ్రైవింగ్.. తప్పిన ముప్పు

BPT: పెద్ద నెమలిపురి వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ ప్రమాదం తృటిలో తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే నివాస గృహాలు ఉండగా, లారీ కాలువలోనే ఆగిపోవడంతో ఇళ్లపైకి దూసుకెళ్లే ప్రమాదం తప్పింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.