హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొక్కిలిగడ్డలో పిల్లర్లకే RBK భవనం

కృష్ణా: మోపిదేవి (M) కొక్కిలిగడ్డలో రూ.23.94 లక్షలతో నిర్మించతలపెట్టిన రైతు భరోసా కేంద్రం భవనం పిల్లర్లకే పరిమితమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన ఈ భవనం నిధులు, ఇతర కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం భవనం పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. అసంపూర్తిగా ఉన్న రైతు భరోసా కేంద్రం భవనాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.