హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు'

AKP: నర్సీపట్నంలో అధికారులు కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం ఆరోపించారు. నామినేషన్ల పరిశీలనలో అధికారులు దారుణంగా వ్యవహరించారని, అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినప్పటికీ, అందుకు స్పష్టమైన కారణాలు వెల్లడించలేదన్నారు.