ATP: కళ్యాణదుర్గం వైసీపీలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య ప్రతిపాదించిన బోయ మౌనిక పేరునే అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. రంగయ్య పార్టీ కౌన్సిలర్లతో వరుసగా భేటీ అయి అసమ్మతి తలెత్తకుండా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో రంగయ్య వర్గంలో నూతనోత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో సస్పెన్స్‌కు తెర


