ELR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ పరిశీలించారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో భద్రత, వసతుల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ


