NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన మంగళవారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భవానీమాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం బారులు తీరారు. ప్రభుత్వం, దేవస్థానం, జిల్లా యంత్రాంగం చేపట్టిన తాగునీరు, క్యూలైన్లు, పారిశుద్ధ్యం, భద్రత వంటి సమన్వయ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం


