హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయినవిల్లి: రేపట్నుంచి నామినేషన్ల స్వీకరణ

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై మంగళవారం రాజకీయ పార్టీల నేతలతో అధికారులు సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని ఆర్వో రాంబాబు, ఏఆర్వో సరోవర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల విధివిధానాలను వివరించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.