NTR: నందిగామలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో సందడి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీధర్‌కు, కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేశారు. కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని అనురాధ ధీమా వ్యక్తంచేయగా, నందిగామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో బీ-ఫామ్‌ల అందజేత


