హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలి'

అన్నమయ్య: నామినేషన్ల దాఖలు సందర్భంగా పీలేరులో 200 మీటర్ల పరిధిలో ర్యాలీలు, సభలు, గుంపులుగా చేరడం నిషేధమని రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో శివ కుమార్ ఎంపీడీవో శ్రీనివాసు తెలిపారు. జెండాలు, బ్యానర్లు ప్రదర్శించరాదని, అభ్యర్థులను అడ్డుకోరాదని సూచించారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.