హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల సందర్భంగా పోలీసుల హెచ్చరికలు

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కొండాపురం పోలీసులు పలు ఆంక్షలు విధించారు. అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, సాక్షి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి రావాలని సీఐ పి.రాజా సూచించారు. వాహనాలను 500 మీటర్ల దూరంలో ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘించి ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.