నెల్లూరు: వెంకటాచలం–కొమ్మలపూడి రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 40–45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని అధికారులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి


