KDP: మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లికి చెందిన శివయ్య దంపతుల ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న టీఎస్ఆర్ సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తమ్మిశెట్టి సుభద్రమ్మ రూ.10 వేల నగదు సాయం అందించారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలకు అండగా నిలవడమే ట్రస్ట్ లక్ష్యమని, భవిష్యత్తులోనూ కుటుంబానికి సహకరిస్తానని భరోసా ఇచ్చారు. సుభద్రమ్మకు దంపతులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత


