ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం జాతీయ రహదారి పక్కన కాలవ గట్టు వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండా స్థూపాలు ముసుగు లేకుండా దర్శనమిస్తున్నాయి. జెండాలు తీసేసినా దిమ్మెలపై NTR, జై గన్ని, జై జనసేన అనే నినాదాలు, పార్టీ రంగులు అలాగే ఉన్నాయి. కోడ్ ప్రకారం వీటికి తెల్ల ముసుగు వేయాలి.. కానీ వేయలేదు. రహదారి పక్కనే ఇలా ఉండటం కోడ్ ఉల్లంఘనేనని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
నారాయణపురంలో ముసుగు లేని పార్టీ జెండా స్థూపాలు


