హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 541 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1,594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 480 సాధారణ కేంద్రాలు కాగా, 573 సమస్యాత్మక, 541 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అనంతపురం గ్రామీణ మండలంలో 85, తాడిపత్రిలో 30 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. అక్కడ పోలీసు బందోబస్తును రెట్టింపు చేయనున్నారు.