కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఐచర్ వ్యాన్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి గన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


