హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

GNTR: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు.