హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి

AKP: జిల్లా ప్రజలకు హోంమంత్రి అనిత విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది ప్రతీక అన్నారు. ప్రతి ఇల్లూ సంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తోందని, దుర్గాదేవి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరారు.