హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాత గుంతకల్‌లో వైభవంగా విజయదశమి వేడుకలు

ATP: పాత గుంతకల్‌ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో మంగళవారం విజయదశమి వేడుకలు కన్నులపండుగగా సాగాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.