హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో దట్టమైన పొగమంచు

HYD: హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. అక్టోబర్ మూడో వారంలోనే చలి తీవ్రత పెరగడంతో ఉదయం పూట విజిబిలిటీ గణనీయంగా తగ్గింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), జాతీయ రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఫాగ్ లైట్లు వినియోగించాలని, తక్కువ వేగంతో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.