హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి స్వల్ప గాయాలు

NZB: సిరికొండ మండలంలోని రామడుగు గ్రామ రామాలయం సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒడ్డెర కాలనీకి చెందిన దండ్ల మనోహర్‌, రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన చేపూర్ పవన్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మనోహర్‌ ఎలక్ట్రిక్ బైక్‌పై రోడ్డు దాటుతుండగా, కొండాపూర్‌ నుంచి భీమ్‌గల్‌ వెళ్తున్న పవన్ బైకుకు ఢీ కొట్టడంతో, బైకు ధ్వంసం అయింది.