ప్రకాశం: జరుగుమల్లి(మం) కామేపల్లి పోలేరమ్మ అమ్మవారు దసరా సందర్భంగా నేడు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆలయానికి దసరా సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు ప్రధానార్చకుడు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిస్తున్న పోలేరమ్మ తల్లి


