హైదరాబాద్: 28°C
వార్తలు

‘మత్తు పదార్థాల వ్యసనం దేశానికి తీవ్ర సమస్య’

నాగ్‌పూర్‌లో జరిగిన RSS విజయదశమి వేడుకల్లో చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాల వ్యసనం దేశానికి తీవ్రమైన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచి, చెడుల విచక్షణ లేక యువత డ్రగ్స్‌కు బానిసవుతోందని, వారికి సరైన మార్గం నేర్పించాలని సూచించారు. ఈ వ్యసన నివారణపై సకాలంలో చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రభుత్వం, సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు.