హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంట్లోనే మాయమైన 20 తులాల బంగారం

MDK: శివంపేట సికింద్రాపూర్‌కు చెందిన మహేశ్ ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలు గాయబయ్యాయి. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం బీరువా తీసిన కుటుంబ సభ్యులకు నగలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్ఐ మధుకర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇది దొంగతనమా లేక ఇంట్లోనే ఆభరణాలు ఎక్కడైనా మిస్సయ్యాయా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.