మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, అంతరం, గుండ్లపల్లి, కొంతన్‌పల్లి, దంతన్‌పల్లి గ్రామాల్లో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, నియోజకవర్గ ప్రజలకు సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి


