హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు

MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాల శివారులో సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని రూప్ నాయక్ తండా, మందపల్లి, రేండ్లగూడ, కలమడుగు గ్రామాల శివారులలో ఉన్న పొలాలకు 139 డిస్ట్రిబ్యూటరీ పరిధిలోని 13వ కెనాల్ ద్వారా సాగునీరు అందుతుంది. అయితే 15 రోజులుగా సాగునీరు రాకపోవడంతో సుమారు 100 ఎకరాలలో ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.