హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కార్యాచరణపై టీడీపీ నేతల సమావేశం

మార్కాపురంలో జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధ్యక్షతన జిల్లా ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక, అభ్యర్థి ఎంపిక, రాబోయే ఎన్నికల కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగాలని నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.