హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం

MLG: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పెండింగ్‌ దరఖాస్తులపై అదనపు కలెక్టర్‌ CH. మహేందర్‌జీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అటవీ, విద్యా శాఖల అర్జీలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ప్రజావాణిపై వచ్చే బాధితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.