హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తాచెదారంతో అధ్వానంగా పార్కు

MDCL: షాపూర్‌నగర్, గాజులరామారంలోని 4 వేల గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పార్కు నిర్వహణ లేక అధ్వానంగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగాయి. ప్రధాన ద్వారం ముందే వ్యర్థాలు పేరుకుపోవడంతో పార్కులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి పార్కును శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.