హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై మురుగు నీరు.. ప్రజల ఇబ్బందులు

VKB: వికారాబాద్ మున్సిపాలిటీ 25వ వార్డు సుభాష్‌నగర్ నడిబొడ్డున మురుగు నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే చికెన్, మటన్ దుకాణాలు, కూరగాయల మార్కెట్ ఉండటంతో ఈగలు, దోమలు ముసురుకుని వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలిజ్వరాల బారిన పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.