హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు'

TPT: తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనాలు కల్పించనుంది. అలాగే అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవలతో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. సాధారణ భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.