హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నవంబర్ 15 లోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి'

KMM: వెలుగుమట్ల కాలనీలో నిర్మాణంలో ఉన్న 300 ఇందిరమ్మ ఇళ్ల పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని మంత్రి తుమ్మలనాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి పనులను పరిశీలించిన ఆయన, ఇళ్లన్నీ ఒకే నమూనా, రంగుతో ఆకర్షణీయంగా నిర్మించాలన్నారు. అధికారులు రోజూ పర్యవేక్షిస్తూ.. అక్టోబర్ నెలాఖరుకల్లా స్లాబులు, విద్యుత్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.