హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

GNTR: తెనాలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టూ టౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి గంగానమ్మపేటలో రేషన్‌ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓ ఆటోలో 50 కిలోల చొప్పున ఉన్న ఆరు బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్‌ చేశారు.