హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన తవ్వకాలు

MDCL: కూకట్‌పల్లి పరిధిలో జలమండలి తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. మూసాపేట సర్కిల్ ప్రకాశ్‌నగర్ హైటెన్షన్ రోడ్డులో మంజీరా స్లూయిజ్ వాల్వ్ మరమ్మతుల కోసం భారీ గుంత తవ్వి, ఒకవైపు మాత్రమే బారికేడ్ ఏర్పాటు చేశారు. ప్రశాంత్‌నగర్ డివిజన్ సాయిబాబా కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గుంతల వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాల భయం నెలకొంది.