కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఆడుతూ యువతి కుప్పకూలి మృతి చెందింది. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన ఎల్కా శ్రీవాణి (24) ఆసిఫాబాద్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. సోమవారం రాత్రి బతుకమ్మ ఆడుతున్న సమయంలో శ్రీవాణి ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది.
తెలంగాణ
బతుకమ్మ ఆడుతూ యువతి మృతి


