హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

SKLM: ఆమదాలవలసలో గల గ్రామ దేవత పాల పోలమ్మ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు ఇవాళ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నర్సింగరావు, సాయి విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.