హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్సు అప్పగించి నిజాయితీ చాటుకున్న యువకులు

KNR: జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద దొరికిన పర్సును శాయంపేటకు చెందిన నాగులపల్లి అజయ్, యమ సంతోశ్ నిజాయితీగా పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పర్సులో రూ.1,900 నగదుతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయి. కార్డుల వివరాల ఆధారంగా ఆ పర్సు నాగంపేటకు చెందిన పొన్నగంటి సంపత్‌దిగా గుర్తించారు. నిజాయితీ చాటుకున్న యువకులను సీఐ రామకృష్ణ గౌడ్ అభినందించారు.