హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ విజేతలకు బహుమతులు

NLG: మఠంపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హుజూర్ నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలతో సందడి చేశారు. అనంతరం సీఐ చరమందరాజు విజేతలకు బహుమతులు అందజేసి, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.