హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం

ATP: గుత్తి మున్సిపల్ ఛైర్మన్‌గా గోవిందరాజుల తమిళ్ సెల్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్ పదవికి దాఖలైన 8 నామినేషన్లలో వైసీపీ, బీఎస్పీ అభ్యర్థులవి సహా 6 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 32 వార్డులకు 73 నామినేషన్లు దాఖలు కాగా 71 ఆమోదం పొందాయి. యువనేత ఈశ్వర్ వ్యూహాలతో ఈ విజయం సాధించినట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు.