ఆసిఫాబాద్ జిల్లాలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. జిల్లాలో 728 మంది ఆశా కార్యకర్తలు,118 సబ్ సెంటర్ ల ద్వారా ఇంటింటా సర్వే చేపడతామన్నారు. చర్మంపై స్పర్శజ్ఞానం లేని మచ్చలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
అక్టోబర్ 22 నుంచి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే


