RR: చింతలకుంట డివిజన్ పరిధిలోని సాగర్ రింగ్‌రోడ్డు నుంచి చింతలకుంట చెక్‌పోస్టుకు వెళ్లే మార్గంలో తిరుమలనగర్ కాలనీ వద్ద రోడ్డు పక్కన చెత్త వేస్తున్నారు. రాత్రివేళ ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేసినా ఎంఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు


