హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

KMM: ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పండుగ షాపింగ్ ముగించుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొనడంతో మద్దిబోయిన వెంకటేశ్వర్లు, రమ్య దంపతులు అక్కడికక్కడే కన్నుమూశారు. తల్లిదండ్రుల హఠాన్మరణంతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మిగిలారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.