RR: హస్తినాపురం డివిజన్ పరిధిలోని భూపేశ్ గుప్తానగర్ చౌరస్తాలో మురుగు నీరు చేరి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డైమండ్ కాలనీలో వాకిళ్లు కడిగిన నీరు పల్లంగా ఉన్న చౌరస్తాలోకి వచ్చి చేరుతోంది. వాహనాల రాకపోకలతో రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగు నీటి సమస్యను పరిష్కరించి, రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
మురుగు నీరు.. గుంతలమయంగా రోడ్డు


