RR: చైతన్యపురి డివిజన్ పరిధిలోని ద్వారకాపురంలో మ్యాన్‌హోల్ మరమ్మతు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రోజులు గడుస్తున్నా పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక, మ్యాన్‌హోల్ చుట్టూ సరైన బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ద్వారకాపురంలో అసంపూర్తిగా మ్యాన్‌హోల్ పనులు


